కలం, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కొడుకు బండి సాయి భగీరథ్ (Bandi Sai Bhageerath) పై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన మైనర్ బాలికకు బలవంతంగా మద్యం తాగించి ఆమెపై లైంగిక దాడి చేశాడనే ఆరోపణలతో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది.
అయితే కేసు నమోదు అయినప్పటికీ అతనిపై ఇప్పటివరకు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీనికి నిరసనగా పేట్ బషీర్‌బాగ్ పోలీస్ స్టేషన్‌ను మహిళలు ముట్టడించారు. బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోక్సో కేసు నమోదైనప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై వారు నిలదీశారు. ఈ మేరకు స్టేషన్ ముందు బైఠాయించి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు.

