Mobile Popup Ad
Mobile Popup Ad

సీఎం విజయ్ సెల్ఫీ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన టీవీకే అధినేత విజయ్ (CM Vijay) ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. అనంతరం తన ఫోన్ తీసుకుని వేదికపై ఉన్న రాహుల్ గాంధీ, ఇతర అతిథులతో పాటు అక్కడకు హాజరైన అశేష జనసందోహంతో సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఈ సందర్భంగా స్టేడియం మొత్తం చప్పట్లు, అరుపులు కేకలతో దద్దరిల్లింది. విజయ్ ఎన్నికల సభల్లో భాగంగా.. పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు పలు మార్లు సెల్ఫీ వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది అప్పట్లో తెగ వైరల్ కాగా.. సీఎం అయిన తరువాత అలాగే వీడియో తీయడంతో ట్రెండ్ అవుతోంది.

సచివాలయానికి చేరుకున్న సీఎం..

ప్రమాణ స్వీకారం అనంతరం కట్టుదిట్టమైన భద్రత నడుమ సీఎం విజయ్.. సచివాలయానికి చేరుకున్నారు. అక్కడ పోలీస్ దళాలు కొత్త ముఖ్యమంత్రికి గార్డ్ ఆఫ్ హానర్ అందించాయి. మరికాసేపట్లో, ముఖ్యమంత్రి సచివాలయంలో కొత్త మంత్రులు, అధికారులతో సమావేశం కాబోతున్నారు. పరిచయం తరువాత.. కొన్ని శాఖలపై వివరాలు అడిగి తెలుసుకోనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>