రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం: సీఎంగా విజయ్ కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్‌ డెస్క్‌ : తమిళనాడు రాజకీయల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం విజయ్ (CM Vijay) కీలక ప్రసంగం చేశారు. తాను ప్రజల ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిని అని, అన్నగా తమ్ముడిగా అండగా ఉంటానని ఆయన ఉద్వేగభరితంగా ప్రకటించారు. ఆకలి, పేదరికం విలువ తెలిసిన వ్యక్తిగా సామాన్యుల కష్టాలను తీరుస్తానని హామీ ఇచ్చారు.

రాజకీయాల్లో అసాధ్యమైన వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసే సంస్కృతికి స్వస్తి పలుకుతానని విజయ్ స్పష్టం చేశారు. ఏది సాధ్యమో అది మాత్రమే చెప్తానని, ఇచ్చిన మాటపై నిలబడతానని భరోసా ఇచ్చారు. తన ప్రభుత్వంలో అధికార వికేంద్రీకరణ కాకుండా ఒకే పవర్ సెంటర్ ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై పారదర్శకత కోసం త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తానని వెల్లడించారు.

తమిళనాడు భవిష్యత్తు అయిన యువతకు, చిన్నారులకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తానని ఆయన పేర్కొన్నారు. చిన్నారులకు మేనమామగా అండగా ఉంటూ వారి కలలను నిజం చేస్తానని మాటిచ్చారు. తనను విమర్శించే వారు, ఇబ్బంది పెట్టేవారిని కూడా శ్రేయోభిలాషులుగానే భావిస్తానని విజయ్ హుందాగా వ్యాఖ్యానించారు. ఒక సుస్థిరమైన పాలనను అందిస్తూ రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం అవుతానని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.

మోయలేని భారం నా మీద పడింది..

ఖజానా మొత్తం ఖాళీ అయింది. దాదాపు పది లక్షల కోట్ల అప్పు రాష్ట్ర ప్రజలపై ఉన్నదని సీఎం విజయ్‌ అన్నారు. మోయలేని భారాన్ని భుజాలకు ఎత్తుకున్నానని తెలిపారు. లోతుల్లోకి వెళ్ళిన తర్వాతే ఏది ఎక్కడ ఉన్నదో తెలుస్తున్నది. ఏం లేదో అర్థమవుతున్నది. అని పేర్కొన్నారు.

విజయ్‌ మాట్లాడుతూ.. ‘నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్రంలోని పరిస్థితి ఏంటో తెలుస్తున్నది. ఏ పని చేయాలన్నా చేతిలో డబ్బులు ఉండాలి. కానీ గత ప్రభుత్వం మొత్తాన్ని ఖాళీ చేసి వెళ్ళింది. చేతిలో అప్పులను పెట్టింది. అందుకే ఆర్థిక పరిస్థితిని ప్రజలకు అర్థం చేయించడానికి ఒక వైట్ పేపర్ (శ్వేతపత్రాన్ని) విడుదల చేయాలనుకుంటున్నాను. అందులోనే రాష్ట్ర ఖజానా పరిస్థితి ఏంటో, ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయో, ప్రతి నెలా వాటికి ఎంత ఖర్చు చేయాలో, నేను మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను అమలు చేయడానికి ఎంత ఖర్చవుతుందో, దాన్ని ఎలా సర్దుబాటు చేసుకోవాలో.. వీటన్నింటినీ ఆ వైట్ పేపర్‌లో వెల్లడిస్తా..’ అని వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>