ముగిసిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ

కలం, వెబ్ డెస్క్: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి (Uday Krishna Reddy) రెండు రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. దీంతో కోర్ట్ ఆదేశాల మేరకు తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. త్వరలోనే మరోసారి కస్టడీకి తీసుకోవాలని విచారణ అధికారులు భావిస్తున్నారు. అంతేగాకుండా ఉదయ్ చెప్పిన వివరాల ప్రకారం సాంకేతిక ఆధారాలను కూడా సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ కేసు విచారణను ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ లావణ్య నాయక్ చేపట్టగా.. గురువారం నాడు హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్వయంగా నిందితుడిని ప్రశ్నించడంతో కేసు కీలక మలుపు తిరిగింది.

వాటిలోనే కీలక వివరాలు..

మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డి పర్సనల్ ఐ–ఫోన్, ల్యాప్ టాప్‌ను ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. అందులోనే కీలక వివరాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ట్రైనీ మహిళా ఐపీఎస్ కంటే ముందు మరో వివాహితతో ఉదయ్ సాన్నిహిత్యంగా ఉండేవారని ఇప్పటికే గుర్తించారు. ఇక విచారణ సమయంలో పోలీస్ అధికారులనే ఉదయ్ ఎదురు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తనను ఎందుకు విసిగిస్తున్నారు..? అంటూ అసహనం వ్యక్తం చేయడంతో సజ్జనార్ రంగంలోకి దిగి పలు వివరాలు రాబట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>