మాజీ మంత్రి అప్పలరాజుకు మరోసారి చుక్కెదురు

కలం, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు( Seediri Appalaraju)కు మరోసారి నిరాశ ఎదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సోంపేట కోర్టు తిరస్కరించింది. ఈ మేరకు అప్పలరాజు వరుసగా దాఖలు చేసిన రెండు బెయిల్ పిటిషన్లను సోంపేట కోర్టు డిస్మిస్ చేసింది.

అంతేకాదు సీదిరి అప్పలరాజు రిమాండ్‌ను కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు అరవ్ అతివేగంగా బైక్ నడపడం వల్ల శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందినట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసులో సీదిరి అప్పలరాజు ఏ 3 నిందితుడిగా ఉన్నారు. కాగా, ప్రస్తుతం మాజీ మంత్రి జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. ఇప్పటికే 16 రోజులుగా జైలులోనే ఉన్నారు. కోర్టు తాజా తీర్పు నేపథ్యంలో సీదిరి అప్పలరాజు మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>