ఇది రోడ్డా, పొలమా..? సీతక్క ఇలాకాలో వినూత్న నిరసన

కలం, వెబ్​ డెస్క్​: మంత్రి సీతక్క (Seethakka) ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని మంగపేట మండలం కొత్తమల్లూరు గ్రామంలో రహదారి దుస్థితిపై గ్రామస్థులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా రోడ్డు మరమ్మతులు చేపట్టకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై వరి నాట్లు నాటి తమ నిరసనను తెలియజేశారు. వర్షాల కారణంగా రహదారి పూర్తిగా గుంతలమయంగా మారి, బురదతో నిండిపోవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారిని వెంటనే మరమ్మతులు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>