దారుణం.. భర్త ఎదుటే భార్య గొంతు కోసి హత్య

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా బొల్లారం పారిశ్రామిక వాడలోని IDA క్రీడా ప్రాంగణం వద్ద దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త ఎదుటే కొందరు దుండగులు భార్యను గొంతు కోసి హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బొల్లారంలోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న దంపతులు అనిల్, మీనా సంతకు వెళ్లి తిరిగి బైక్ పై వస్తుండగా.. కొందరు దుండగులు వారిని అడ్డగించారు.

ఈ క్రమంలోనే మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించారు. అడ్డుకోబోయిన భర్త అనిల్ పై కత్తితో దాడి చేసిన దుండగులు.. అనంతరం భార్య మీనా గొంతు కోసి హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతురాలి డెడ్ బాడీని మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>