నారాయణ్‌ఖేడ్‌లో గంజాయి పట్టివేత.. ఇద్దరు నిందితుల అరెస్ట్

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో గంజాయిని తరలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటకలోని బీదర్ నుండి నారాయణఖేడ్ పట్టణంలోని వాసర్‌కు 30 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా.. ఎక్సైజ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు.

ఈ దాడిలో పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ.15 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. నిందితులు శేరి తండాకు చెందిన చౌహన్ ప్రభు, మున్నా నాయక్ తండాకు చెందిన పార్ లాల్ రాథోడ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>