కలం, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలోని పూణే (Pune) నగరంలో భయానక ఘటన చోటుచేసుకుంది. చకన్ (Chakan) ప్రాంతంలో తెల్లవారుజామున సుమారు 2.15 గంటల సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళపై ఆరు నుంచి ఏడు కుక్కలు ఒకేసారి దాడి చేశాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటన జరిగిన వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలపాలైన మహిళను పరిశీలించగా ఆమె మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన అనంతరం, కుక్కల దాడి కారణంగానే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
Read Also: సిద్దిపేట జిల్లాలో ముగ్గురు కానిస్టేబుల్స్‌పై సస్పెన్షన్ వేటు
Follow Us On: Instagram

