Mobile Popup Ad
Mobile Popup Ad

ఎమ్మెల్యేలు భవిష్యత్ ప్లానింగ్ పై దృష్టి పెట్టండి : సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాబోయే భవిష్యత్ మీద దృష్టి పెట్టాలని.. ఆ మేరకు ప్రణాళికలు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదేశించారు. తాజాగా జరిగిన సీఎల్పీ మీటింగ్ లో సీఎం రేవంత్ మాట్లాడారు. ‘ప్రజా ప్రభుత్వంలో మూడో బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నాం. ప్రభుత్వ ప్రాధాన్యతలు, విధానాలను గవర్నర్ ప్రసంగంలో వివరించారు. గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ ప్రభుత్వానికి రోడ్ మ్యాప్ లాంటిది. దానికి తగ్గట్టు మన ప్రాణాళికలు ఉండాలి’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించే సమయం అయిపోయిందని.. ఇక నుంచి కాంగ్రెస్ భవిష్యత్ ప్రణాళిక కోసం పనిచేయాలని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ చెప్పారు. ‘సభలో ప్రభుత్వం చర్చలు పక్కదారి పట్టకుండా చూడాలని.. సభా సమయం వేస్ట్ కాకుండా అందరూ సహకరించాలని సీఎం రేవంత్ కోరారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ ఎస్ ప్రభుత్వం కనీసం మాట్లాడేందుకు మైక్ కూడా ఇవ్వలేదు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జానారెడ్డికి కూడా మైక్ కట్ చేశారు. నేను ప్రశ్నిస్తుంటే నన్ను సస్పెండ్ చేసి సెషన్ మొత్తం అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్నారు. కాబట్టి సభలో మాట్లాడే ప్రతి విషయం మీద అందరూ అవగాహన పెంచుకోవాలి. అసెంబ్లీకి హాజరు విషయంలో ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దు. మహిళా శాసన సభ్యులు హాజరుతో పాటు చర్చల్లో పాల్గొనాలి. అసెంబ్లీలో మాట్లాడే సబ్జెక్టుల మీద విప్ ల మధ్య సమన్వయం ఉండాలి’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

అసెంబ్లీలో మాట్లాడే అంశాలలో మహిళా ఎమ్మెల్యేలు కూడా భాగస్వామ్యం కావాలన్నారు సీఎం రేవంత్. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి విధి విధానాలను అధ్యయంనం చేయాలని.. వాటిని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగించాలని సీఎం చెప్పారు. ‘రాజకీయాల్లో వ్యక్తిగత డ్యామేజీ ఉండొద్దు.. అది వ్యవస్థ మొత్తాన్ని డ్యామేజ్ చేసే ప్రమాదం ఉంది. ఒక వ్యవస్థ నిలబడితేనే రాజకీయాల్లో మనుగడ అనేది సాధ్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టీ లైన్ కు తగ్గట్టే స్పందించాలి. ఇప్పుడు వేసుకునే రోడ్ మ్యాప్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఎజెండా అవుతుంది. ఈ సమ్మర్ మొత్తం సాగు, తాగునీటి సమస్యలపై ఫోకస్ చేయండి. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికను (Praja Palana – Pragati Pranalika) ప్రజల్లోకి తీసుకెళ్లాలి’ అని సీఎం రేవంత్ (Revanth Reddy) పేర్కొన్నారు.

Read Also: సిధారెడ్డికి కేంద్ర పురస్కారం తెలంగాణకు గర్వకారణం : సీఎం రేవంత్

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>