Mobile Popup Ad
Mobile Popup Ad

AI పై రేపు జర్నలిస్టులకు వర్క్ షాప్

కలం, మెదక్ బ్యూరో: జర్నలిజంలో కృత్రిమ మేధ (AI )వినియోగం, మీడియా రంగంలో (Journalism) వస్తున్న నూతన మార్పులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై వారికి అవగాహన కల్పించడమే లక్ష్యంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) సంగారెడ్డిలో (Sangareddy) వార్తాలాప్ పేరిట రేపు మీడియా వర్క్‌షాప్ ను నిర్వహించబోతుంది. ఈ వర్క్‌షాపులో మహిళపై లింగ ఆధారిత హింస, స్త్రీ సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పై అవవగాహన కల్పించేందుకు ప్రముఖ పాత్రికేయురాలు సజయ కాకర్ల, ఫ్యాక్ట్ చెక్ శిక్షణ నిపుణురాలు సత్య ప్రియ బీఎన్ జర్నలిస్టులకు దిశానిర్దేశం చేస్తారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పీ ప్రావీణ్య చీఫ్ గెస్టుగా హాజరుకానున్నారు. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా జర్నలిస్టుల కోసం పీఐబీ హైదరాబాద్ విభాగం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో రేపు ఉ. 10 గంటలకు వార్తాలాప్ మీడియా వర్కుషాపును నిర్వహిస్తుందని.. పాత్రికేయులందరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పీఐబీ కోరుతోంది.

Read Also: లైంగికదాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>