Mobile Popup Ad
Mobile Popup Ad

టీవీ సౌండ్ తగ్గించమన్న భర్త.. చంపేసిన భార్య

కలం, డెస్క్ : ఈ మధ్య చిన్న చిన్న కారణాలకే మర్డర్లు చేసేస్తున్నారు. భార్యాభర్తల మధ్య సిల్లీ కారణాలకే పెద్ద గొడవలు అయిపోతున్నాయి. కూరలో ఉప్పు లేదని.. మొబైల్ చూడొద్దని చెప్పినందుకు ఇలా చిన్న కారణాలతోనే మర్డర్ల దాకా వెళ్లిపోతున్నారు. తాజాగా గుంటూరులో టీవీ సౌండ్ తగ్గించమన్న భర్తను మర్డర్ చేసేసింది భార్య. వినడానికి చాలా విచిత్రంగా అనిపించినా.. ఇదే నిజం. జిల్లాలోని మంగళగిరి (Mangalagiri) టిడ్కో ఇళ్ల సముదాయంలో ఈ దారుణం చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహమ్మద్, క్రాంతి ఏడాది క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇద్దరూ టిడ్కో ఇళ్ల సముదాయంలోనే ఉంటున్నారు. గురువారం సాయంత్రం క్రాంతి టీవీ చూస్తోంది. మహమ్మద్ టీవీ సౌండ్ తగ్గించమని చెప్పాడు. దానికి క్రాంతి ఒప్పుకోలేదు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. గొడవ పెద్దది కావడంతో సహనం కోల్పోయిన క్రాంతి మహమ్మద్ ను కత్తితో పొడిచి చంపేసింది. స్థానికుల సమాచారంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్రాంతిని అదుపులోకి తీసుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>