Mobile Popup Ad
Mobile Popup Ad

బదిలీలకు కేరాఫ్ సంగారెడ్డి DMHO

కలం, మెదక్ బ్యూరో: వైద్య అరోగ్య శాఖ మంత్రి సొంత జిల్లా సంగారెడ్డిలో అయ‌న అలోచ‌న‌ల‌కు అనుగుణంగా ప‌నిచేసే జిల్లా వైద్యాశాధికారి దొర‌కడం లేదా? సంగారెడ్డి డిఎంహెచ్ఓ (Sangareddy DMHO) పోస్టులో త‌రుచు బ‌దిలీలు జ‌ర‌గ‌డానికి కార‌ణం ఏంటి? ఏడాదిలోపే న‌లుగురు డీఎంహెచ్ఓలు మార‌డంతో వైద్య సేవ‌లపైన ప్ర‌భావం ప‌డుతున్నాయా? అత్యంత కీల‌క‌మైన సంగారెడ్డి డిఎంహెచ్ఒ పొస్టు ఎంపిక సాక్ష‌త్తూ వైద్య మంత్రికి స‌వాల్ గా మారిందా? అనేది జిల్లాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

వివాస్ప‌దంగా సంగారెడ్డి డీఎంహెచ్ఓ పోస్టు..

సంగారెడ్డి జిల్లా డీఎంహెచ్ఒ పోస్టు త‌రుచు వివాదాల్లో నిలుస్తుంది. సంగారెడ్డి డీఎంహెచ్ఒకు 2021 మార్చి నుంచి డా.గాయ‌త్రీ దేవి 2025 జూలై వ‌ర‌కు ఐదేళ్ల పాటు ల్ఇంచార్జి డీఎంహెచ్ఒ గా భాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. అమె త‌ర్వాత డాక్ట‌ర్ నాగ‌నిర్మ‌ల డీఎంహెచ్ఒగా వ‌చ్చి కేవ‌లం నాలుగు నెల‌లు మాత్రమే ఉన్నారు. అమె స్ధానంలో డాక్ట‌ర్ వ‌సంత‌రావు 2025 నవంబ‌ర్ లో డీఎంహెచ్ఒగా భాధ్య‌త‌లు తీసుకోని కేవ‌లం అరు నెల‌ల్లో అగ‌మేఘ‌ల మీద‌ బ‌దిలీ అయ్యారు. తాజాగా శుక్ర‌వారం 29 తేదిన కొత్త‌గా డా. ల‌లితా దేవి డీఎంహెచ్ఒ గా వచ్చారు. ఇలా 2025 జూలై నుండి 2026 మే వ‌ర‌కు దాదాపు ప‌ది నెల‌లో నాలుగురు డీఎంహెచ్ఒలు సంగారెడ్డికి రావ‌డం చర్చనీయాంశంగా మారింది. ఐదేళ్లు పనిచేసిన చేసిన డా. గాయ‌త్రిదేవి నుండి, అరు నెల‌లు చేసిన వ‌సంత‌రావు వ‌ర‌కు అవినితీ, అధికార దుర్వినియోగం అరోప‌ణ‌లు ఉన్నాయి.

అకస్మిక బ‌దిలీ కార‌ణ‌మేంటి..

తాజాగా బ‌దిలీ అయిన వసంత‌రావుపై ప‌లు అరోప‌ణ‌లతో, అయ‌న ప‌నితీరు ప‌ట్ల అరోగ్య మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహకు సంతృప్తిగా లేర‌నే స‌మాచారం వినిపిస్తుంది. అరోగ్య మంత్రిగా దామోద‌ర ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకురావ‌ల‌నుకుంటున్న డిజిట‌ల్ హెల్త్ ప్రొపైల్ ప్రోగాం కోసం సంగారెడ్డి జిల్లాను పైల‌ట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అమలు ద్వారా రోగుల ఆరోగ్య చరిత్ర, పరీక్షల వివరాలు, చికిత్స సమాచారం అన్నీ ఒకే వేదికపై అందుబాటులో ఉండి, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన వైద్య సేవలు అందించే విధంగా సంగారెడ్డిలో విజ‌యవంతం చేసినా త‌ర్వాత రాష్ట్ర వ్యాప్తంగా డిజిట‌ల్ హెల్త్ ప్రొపైల్ ప్రోగాంను అమలు చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ ప్రతిష్టాత్మ‌క కార్య‌క్ర‌మం ప‌ట్ల సంగారెడ్డి జిల్లా డీఎంహెచ్ఓగా వ‌సంత‌రావు నిర్ల‌క్ష్యంగా ఉన్న‌డ‌ని చెబుతున్నారు. తాజాగా ఓ మృతుడి కుటుంబానికి నష్టపరిహారంగా వచ్చిన డబ్బులను సంగారెడ్డి DMHO వసంత్ రావు వాడుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుడికి సంబంధించిన 10 ల‌క్ష‌ల రుపాయ‌ల‌ను వ‌సంత్ రావు వాడుకున్న‌డ‌ని బంధువులు అందోళ‌నం చేయ‌డం సంచ‌నం మారింది. అంతేకాకుండా ప్రైవేటు హ‌స్ప‌ట‌ల్స్ పై సెటిల్ మెంట్లు, టార్గెట్ పెట్టి వ‌సూలు చేస్తుడ‌నే అరోప‌ణ‌లు నేప‌ధ్యంలో బ‌దిలీ అయిన‌ట్టు తెలుస్తుంది.

వైద్య సేవ‌లపైన ప్ర‌భావం..

సాక్ష‌త్తూ రాష్ట్ర వైద్య అరోగ్య శాఖ మంత్రి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సంగారెడ్డి జిల్లాలో ఏడాదిలో న‌లుగురు డీఎంహెచ్ఓలు రావడం ప‌లు స‌మ‌స్య‌ల‌ను వ‌స్తున్నాయి. జిల్లా వైద్యానికి సంబంధించిన ప్ర‌దాన అధికారికి స‌రిగా లేక‌పొవడంతో ప్ర‌భుత్వ అసుపత్రులకు వచ్చే ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవలు అందించ‌టంపైన తీవ్ర ప్ర‌భావం చూపుతుంది. తరుచు జిల్లా వైధ్యాశాఖ‌ధికారి మారుతుండ‌టంతో కింది స్ధాయి సిబ్బంది పైన అజామ‌యిషీ లేకుండా పోతుంది. వైద్య‌శాఖ‌లో వివిధ విభాగాలు, హాస్ప‌ట‌ల్స్, ప‌లు ర‌కాల సిబ్బందిని స‌మ‌న్వ‌యం చేస్తూ దిశ‌దిర్ధేశం చేసే కీల‌క ప‌దవైన‌ వైద్య‌శాఖ‌ధికారి త‌రుచు మారుతుండ‌టంతో జిల్లా పైన పూర్తిస్ధాయి అవ‌గ‌హ‌న లేక వైద్య సేవ‌ల విష‌యంలో జాప్యం జ‌రుగుతుంది. ఇప్ప‌టికైన డీఎంహెచ్ఓ పూర్తిస్ధాయిలో ఉండి సంగారెడ్డి జిల్లాకు మెరుగైన వైద్య సేవలు అందించ‌ల‌ని ప్ర‌జ‌లు కొరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>