Mobile Popup Ad
Mobile Popup Ad

హరీశ్ రావు బీజేపీ నేతలను కలిశారా? లేదా? : అద్దంకి

కలం, వెబ్ డెస్క్: మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర అసహనంగా రగిలిపోతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. హరీశ్ రావు గతంలోనే కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారని ఆరోపించారు. ఆయనను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నమ్మడం లేదని పేర్కొన్నారు. అందుకే కుమారుడు కేటీఆర్‌కు కీలక పదవి ఇచ్చారని గుర్తు చేశారు.

బీఆర్ఎస్ పార్టీలో హరీశ్ రావు పాత్ర ఏమిటి?

అసలు బీఆర్ఎస్ పార్టీలో హరీశ్ రావు పాత్ర ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్ చేసిన తప్పుడు పనులు మొత్తం హరీశ్ రావుకు తెలుసని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చేసిన విమర్శలకు సూటిగా సమాధానం చెప్పకుండా హరీశ్ రావు వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని ఫైర్ అయ్యారు. హరీశ్ రావు ఢిల్లీలో బీజేపీ నేతలను కలిసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా నోటికొచ్చినట్టు వాగుతున్నారని ఫైర్ అయ్యారు. పక్కా సమాచారంతోనే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని పేర్కొన్నారు. హరీశ్ రావు విమర్శలకు నేరుగా సమాధానం చెప్పకుండా వ్యక్తిగత దాడులు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలను కలిసింది నిజమా? కాదా? అన్న దానికి హరీశ్ రావు నేరుగా సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>