కలం, వెబ్ డెస్క్: ‘నీలి రంగు చీరలోన. సందమామ నీవె జాణ’ అంటూ సినీ కవి ఏ ముహుర్తాన పాట రాశారో కానీ.. హీరోయిన్స్, సెలబ్రిటీలు నీలి రంగుపై మనసు పారేసుకుంటున్నారు. ఇటీవల తమిళనాడు సీఎం విజయ్ ప్రమాణ స్వీకారం రోజున నటి త్రిష నీలి రంగు చీరలో మెరిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళ చిత్ర పరిశ్రమ, రాజకీయాల్లోని కీలక ఘట్టాలలో ప్రముఖ నటీమణులు ఐశ్వర్యరాయ్, త్రిష కృష్ణన్ (Aishwarya Rai-Trisha) ధరించిన నీలిరంగు చీరలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
1997లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘ఇరువర్’ చిత్రంలో ఐశ్వర్యరాయ్ లేత ఆక్వా-బ్లూ చీరలో ( Blue Sarees) మెరిసిపోగా, విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమంలో త్రిష బ్లూ కాంచీవరం చీరలో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ రెండు సందర్భాల్లో వారి లుక్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్నాయి.

