కలం, వెబ్ డెస్క్: అడవి శేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం డెకాయిట్ (Dacoit) షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) ఈ చిత్ర బృందానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలపడం విశేషం.
దీనికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. అమీర్ ఖాన్ మేనకోడలు జైన్ మేరీ ఖాన్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తోంది. తాజాగా మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు, ఇందులో ఆమె పోలీస్ ఆఫీసర్ అవతారంలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అమీర్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, తన మేనకోడలికి మద్దతుగా చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు. అమీర్ ఖాన్ సపోర్ట్‌తో ఈ ప్రాజెక్ట్‌కు ఒక్కసారిగా జాతీయ స్థాయిలో ఆసక్తి పెరిగింది.
షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అడవి శేష్ సరసన మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుంది. యాక్షన్, ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న డెకాయిట్ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.

