Mobile Popup Ad
Mobile Popup Ad

ఆ రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు జీతాల్లో కోత.. ఎందుకంటే?

కలం, వెబ్ డెస్క్ : ఆర్థిక ఇబ్బందులు, భారీ రుణభారంతో హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు నేతృత్వంలోని కాంగ్రెస్ గవర్నమెంట్ బడ్జెట్ ను సవరించింది. మొత్తం బడ్జెట్ పరిణామాన్ని రూ. 3,586 కోట్లు తగ్గించి రూ. 54,928 కోట్లకు తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ అధికారులకు ఆరు నెలల పాటు జీతాల్లో కోత (Defers Salaries) విధించనుంది. తిరిగి రాష్ట్ర (Himachal Pradesh) ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తరువాత తగ్గించిన జీతాలు మళ్లీ చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది.

సీఎం జీతంలో 50శాతం.. మంత్రులు, సీనియర్ అధికారులు (చీఫ్ సెక్రటరీ, DGP ర్యాంకు) వారికి 30 శాతం, ఎమ్మెల్యేలకు 20శాతం, పోలీసు అధికారులకు 30 నుంచి 20 శాతం వరకు సాలరీలో కట్ చేయనుంది. అయితే, దిగువ స్థాయి ఉద్యోగులు, పెన్షనర్లపై ఎలాంటి ప్రభావం ఉండదని వారి జీతాలు పూర్తిగా చెల్లించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కానీ, ప్రతిపక్ష బీజేపీ నేతలు ఆర్థిక సంక్షోభానికి కాంగ్రెస్ పాలనపర వైఫల్యమే కారణమని, ఇది ఆర్థిక అత్యవసర పరిస్థితి వైపు దారి తీస్తుందని ఆరోపిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>