Mobile Popup Ad
Mobile Popup Ad

మహబూబ్ నగర్‌లో చెక్కులు పంపిణీ చేసిన విప్ యెన్నం

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు వరంగా మారాయని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ (Mahabubnagar) ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం మహబూబ్ నగర్ గ్రామీణ మండలానికి చెందిన 25 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. పేద కుటుంబాల ఆత్మగౌరవాన్ని పెంపొందించే దిశగా ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. అందులో భాగంగా పేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే మహిళల ఆర్థిక, సామాజిక భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, సర్పంచులు సిద్దప్ప, రాజు గౌడ్, రఘు నాయక్, నర్సింహులు, రంగయ్య నాయక్, నాయకులు సుధాకర్ రెడ్డి, సంజీవరెడ్డి, రాంచంద్రయ్య, తులసీరాం నాయక్, రాము, గోవింద్ యాదవ్, మన్యంకొండ నరేందర్, వెంకటేష్ యాదవ్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>