ప్రభుత్వ ప్రకటన.. జూడాల సంచలన నిర్ణయం

కలం, వెబ్ డెస్క్: ఏపీలోని కూటమి ప్రభుత్వం తీసుకున్న 5 శాతం స్టైపెండ్ పెంపుపై జూనియర్ డాక్టర్లు (AP Junior Doctors) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము 15 శాతం డిమాండ్ చేస్తే.. ప్రభుత్వం కేవలం 5 శాతమే పెంచిందని, తమకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు15 శాతం స్టైపెండ్ పెంచే వరకు నిరసన ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న తమ నిరసనను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ ప్రకటన పూర్తిగా అసంతృప్తిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 8 రోజులుగా తాము నిరసన వ్యక్తం చేస్తున్నా తమ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, కాసేపటిక్రితమే రాష్ట్రంలోని జూనియర్ డాక్టర్ల ఉపకారవేతనం 5 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 15 శాతం పెంచాలని జూడాలు డిమాండ్ చేయగా.. ప్రభుత్వం 5 శాతం పెంచేందుకు అంగీకారం తెలిపింది. 2026 జనవరి 1నుంచి ఇంటర్నీలకు 5 శాతం పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాత ఏటా జూడాల స్టైపెండ్ 3 శాతం పెరగనుంది. పీజీ, సూపర్ స్పెషాలిటీ విద్యార్థులకు ఏటా 3 శాతం పెంచేందుకు అనుమతినిచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>