epaper
Sunday, February 1, 2026
spot_img
epaper

స్కూళ్లోనే రీల్స్ చేయడం నేర్పిస్తారా.. బడ్జెట్ లో ‘ఆరెంజ్ ఎకానమీ’ ఏంటి..?

కలం, డెస్క్ : నేడు ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ లో ‘ఆరెంజ్ ఎకానమీ’కి (Orange Economy) బూస్ట్ ఇచ్చారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా 15వేల స్కూళ్లు, 500 ప్రముఖ కాలేజీల్లో కంటెంట్ క్రియేటర్స్ ల్యాబ్స్ ను ప్రారంభిస్తామని నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) వెల్లడించారు. 2030 నాటికి మన దేశానికి 20 లక్షల మంది సోషల్ మీడియా ఎక్స్ పర్ట్స్ అవసరం అవుతారని నిర్మలా సీతారామన్ చెప్పారు. దీని కోసం స్టూడెంట్లకు టీనేజ్ నుంచే కంటెంట్ క్రియేషన్‌పై ట్రైనింగ్ ఇస్తారంట.

సోషల్ మీడియాలో రచ్చ..

దీనిపై సోషల్ మీడియాలో నానా రచ్చ జరుగుతోంది. ఇప్పటికే చిన్న పిల్లలు ఇన్ స్టా, ఫేస్ బుక్, స్నాప్ చాట్ లాంటి వాటిల్లో రీల్స్ చేస్తూ చదువులు పక్కన పెట్టేస్తున్నారని.. వాళ్ల స్థాయికి మించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని నెటిజన్లు చెబుతున్నారు. ఇప్పుడు స్కూల్ లోనే కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలో.. ఎలా రీల్స్ చేయాలో చెప్తే ఇక మన దేశంలో చదువు, టెక్నాలజీ అనేవి పక్కకు పోతాయంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. పిల్లలకు ప్రపంచంలోని అనేక దేశాలు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తుంటే.. మన దేశంలో మాత్రం ఇలా సోషల్ మీడియాను ఎందుకు ఎంకరేజ్ (Orange Economy) చేస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు.

కేంద్రం వివరణ..

అయితే ఇక్కడ కేంద్రం వివరణ ఇంకో విధంగా ఉంది. కంటెంట్ క్రియేటర్ హబ్ అంటే కేవలం రీల్స్ లో నటించడం నేర్పించడం తమ ఉద్దేశం కాదంటోంది. ఇక్కడ టెక్నికల్ పరమైన అంశాలను స్టూడెంట్లు నేర్చుకుంటారంటూ చెబుతున్నారు అధికారులు. వీడియో ఎడిటింగ్, పాడ్ కాస్టింగ్, గ్రాఫిక్ డిజైన్, స్క్రిప్టు రైటింగ్, డేటా అనలిటిక్స్, డిజిటల్ మార్కెటింగ్, మానిటైజేషన్ లాంటివి విద్యార్థులకు ఈ కంటెంట్ క్రియేటర్ హబ్ లో నేర్పిస్తామని చెబుతున్నాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు.

సోషల్ మీడియా వాడకంలో ఇండియా..

మన దేశం ప్రపంచంలోనే సోషల్ మీడియా మార్కెట్ లో అతిపెద్దది. సోషల్ మీడియాను ఎక్కువగా వాడుతున్న యువత ఇండియాలోనే ఉన్నారు. కాబట్టి ఇంటి వద్ద నుంచే యువతకు ఉపాధి, ఆదాయాన్ని సృష్టించడం కోసమే విద్యార్థులకు ఇలాంటి క్రియేటర్ హబ్ లు పెడుతున్నామని కేంద్రం చెబుతోంది. చిన్న వయసు నుంచే ఉపాధి మార్గాలపై విద్యార్థులకు టెక్నికల్ స్కిల్స్ నేర్పిస్తే.. రేపు పెద్దయ్యాక వాళ్లు ఎటువైపు వెళ్లాలి అనుకుంటే అటు వెళ్తారని చెబుతున్నారు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు. ఉపాధి సృష్టించడమే ప్రభుత్వ ఉద్దేశం అంటున్నారు.

క్లారిటీ అప్పుడే..

కాకపోతే ఇప్పటికీ చాలా మంది యువత, చిన్నారులకు రీల్స్ ను ఎలా ఎడిట్ చేయాలో తెలియదు. ఇప్పుడు స్కూల్ లోనే అవన్నీ నేర్పిస్తే.. స్టూడెంట్లు ఈజీగా రీల్స్, వీడియోలు చేస్తూ టైమ్ వేస్ట్ చేసుకుంటారనేది పేరెంట్స్ వాదన. 15వేల స్కూళ్లలో తెలంగాణలో ఎన్ని స్కూల్స్ పెడుతారనేది ఇంకా క్లారిటీ రాలేదు. స్కూళ్లలో ఈ కంటెంట్ క్రియేటర్ హబ్ లు పెట్టిన తర్వాత అవి స్టూడెంట్లను రీల్స్ చేసుకునేలా ప్రోత్సహిస్తాయా.. లేదంటే ఉపాధి మార్గంగా ఉపయోగపడుతాయా అనేది చూడాలి.

Read Also: బడ్జెట్‌లో ఆయుర్వేదానికి ప్రాధాన్యం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>