Mobile Popup Ad
Mobile Popup Ad

కేసీఆర్ సిట్ విచారణ‌పై KTR హాట్ కామెంట్స్.. కేసీఆర్ అజేయుడు అంటూ!

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్ విచారణ (KCR SIT Inquiry) వ్యవహరం హాట్ టాపిక్‌గా మారింది. అనేక రాజకీయ పరిణామాల మధ్య కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కేసీఆర్ సిట్ విచారణపై రియాక్ట్ అయ్యారు. ఢిల్లీ ఒత్తిళ్లకు తలొగ్గని వ్యక్తి కేసీఆర్ అని, తెలంగాణ కోసం సాగిన సుదీర్ఘ పోరాటంలో సెకను కాలం కూడా పక్కకు తప్పుకోని ధీశాలి అని అన్నారు.

రాష్ట్రం కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా వెనకడుగు వేయని వ్యక్తి అని, దుష్ట శక్తులకు వ్యతిరేకంగా పర్వతంలా నిలబడిన మనిషి కేసీఆర్ అని కేటీఆర్ అన్నారు. చిల్లర రాజకీయాలకు, నీచమైన ఎత్తుగడలకు వణికిపోయే వ్యక్తి కాదని, కేసీఆర్ అజేయుడన్నారు.

‘‘మూర్ఖులు చరిత్రను సృష్టించడం పక్కన పెడితే.. కనీసం చరిత్రను అర్థం కూడా చేసుకోలేరు. ఆయన పేరు వింటేనే మీకు వణుకు పుడుతుంది. ఆయన పేరు ఎత్తే స్థాయి కూడా మీకు లేదు. ఎంత విషం చిమ్మినా.. ఆయనను ఎవరూ ఏమీ చేయలేరు. కేసీఆర్ అంటే తెలంగాణ చరిత్ర.. ఆ చరిత్రలో కనీసం ఒక చిన్న ఫుట్‌నోట్ కూడా కాలేరు’’ అని కేటీఆర్ (KTR) ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

Read Also: ఇది దర్యాప్తు కాదు.. ప్రతిపక్ష నేతపై ప్రతీకార దాడి : హరీశ్​ రావు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>