పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఉద్రిక్తత: బీజేపీ అభ్యర్థిపై దాడి

కలం, వెబ్​ డెస్క్​ : పశ్చిమ బెంగాల్ (West Bengal) ఎన్నికల వేళ కుమార్​గంజ్ (Kumarganj) నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ జరుగుతున్న సమయంలో బీజేపీ అభ్యర్థిపై తృణమూల్ కాంగ్రెస్ (TMC) కార్యకర్తలు మూకుమ్మడి దాడికి తెగబడ్డారు. పోలింగ్ కేంద్రం సమీపంలోనే ఈ ఘటన జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది.

పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న అభ్యర్థిని లక్ష్యంగా చేసుకుని కొందరు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్యబద్దంగా జరగాల్సిన పోలింగ్ రోజున ఇలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభ్యర్థిని రక్షణ వలయంలో ఉంచి సురక్షితంగా బయటకు తీసుకురావడానికి సెక్యూరిటీ ఆపసోపాలు పడటం వీడియోలో కనిపిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులే కావాలని ఈ దాడికి పాల్పడ్డారని బీజేపీ ఆరోపిస్తోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Read Also: పెరగనున్న పెట్రోల్​ ధరలు.. కేంద్రం క్లారిటీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>