epaper
Sunday, March 1, 2026
epaper

ఎప్​స్టీన్ ఎఫెక్ట్​​.. వరల్డ్​ ఎకనమిక్​ ఫోరమ్​ సీఈవో​ అవుట్​​

కలం, వెబ్​ డెస్క్​: ప్రపంచాన్ని కుదిపేస్తున్న ‘ఎప్​స్టీన్​ సెక్స్​ స్కాండల్​’ దెబ్బకు మరో వికెట్​ పడింది. ప్రపంచ ఆర్థిక వేదిక సీఈవో​ బోర్గ్ బ్రెండే (Borge Brende) రాజీనామా చేశారు. ఇప్పటికే ఈ వివాదం కారణంగా బ్రిటన్​ మాజీ ప్రిన్స్​ ఆండ్రూ తన రాచరిక గౌరవాలను, బిరుదులను కోల్పోవడంతోపాటు అరెస్ట్​ కావడం తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలో బ్రెండే బోర్గ్​ కూడా చేరారు. వరల్డ్​ ఎకనమిక్​ ఫోరమ్​(WEF)కు 2017 నుంచి ప్రెసిడెంట్​గా పనిచేస్తున్న ఆయన గురువారం తన పదవి నుంచి దిగిపోయారు.

కాగా, అమాయక యువతులను, బాలికలను ఎరవేసి తన ఆర్థిక సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న అమెరికా మాజీ ఫైనాన్సియర్​ ఎప్​స్టీన్​ దురాగతాలు కొన్నేళ్ల కిందట బయటపడిన సంగతి తెలిసిందే. అనంతరం జైల్లో శిక్ష అనుభవిస్తూ ఎప్​స్టీన్​ ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం, అతని అకృత్యాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు, ఉత్తరప్రత్యుత్తరాలు, మెయిల్స్​ వంటివి అమెరికా న్యాయశాఖ ప్రస్తుతం బయటపెడుతోంది. ఎప్​స్టీన్​ పాపాల్లో ఎంతో మంది బిలియనీర్లు, రాచకుటుంబాల వ్యక్తులు, అత్యున్నత పదవుల్లో ఉన్నవాళ్లు, క్రీడా, సినిమా రంగాల ప్రముఖులకు భాగం ఉన్నట్లు ఇవి వెల్లడిస్తున్నాయి. ఇందులో భాగంగా బోర్గ్ బ్రెండే ​పేరు సైతం ఎప్​స్టీన్​ ఫైల్స్​లో కనిపించడంతో కలకలం రేగింది.

అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన ఫైల్స్​ ప్రకారం.. ఎప్​స్టీన్​తో కలసి బోర్గ్ బ్రెండే ​(Borge Brende) మూడుసార్లు బిజినెస్​ డిన్నర్​లో పాల్గొన్నారు. అంతేకాదు, మెయిల్స్​, మెసెజ్​ల ద్వారా అనేక సార్లు సంప్రదింపులు జరిపారు. దీంతో బోర్గ్​పై తీవ్ర విమర్శలు చెలరేగాయి. అతను రాజీనామా చేయాలని డిమాండ్​లు వచ్చాయి. ఈ క్రమంలో తన పదవులకు రిజైన్​ చేస్తున్నట్లు బోర్గ్​ ప్రకటించారు. ‘దాదాపు 8 నుంచి 12 ఏళ్లు డబ్ల్యూఈఎఫ్​కు ప్రెసిడెంట్​గా, సీఈవోగా సేవలందించాను. ఇక దిగిపోవాల్సిన సమయం వచ్చింది. ఇది ఆలోచించి తీసుకున్న నిర్ణయం ’ అని తన రాజీనామా లేఖలో బోర్గ్​ పేర్కొన్నారు.

ప్రపంచ ఆర్థిక ప్రగతిలో వరల్డ్​ ఎకనమిక్ ఫోరమ్​ పాత్ర ఎంతో కీలకమైనది. ఏటా స్విట్జర్లాండ్​లోని దావోస్​ వేదికగా జరిగే వరల్డ్​ ఎకనమిక్​ సమ్మిట్​ను నిర్వహించేది ఇదే. ఈ సంస్థకు నార్వేకు చెందిన బోర్గ్​ దాదాపు పదేళ్లకు పైగా అధినేతగా ఉన్నారు. ఇప్పుడు ఆయన రిజైన్​ చేయడంతో ప్రస్తుతం వరల్డ్​ ఎకనమిక్ ఫోరమ్​ తాత్కాలిక ప్రెసిడెంట్​, సీఈవోగా అలోయిస్​ జ్వింగీ బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!