Mobile Popup Ad
Mobile Popup Ad

భార్య కోసం బిచ్చగాడుగా మారిన భర్త.. ఎందుకో తెలుసా!

కలం, వెబ్ డెస్క్: బిచ్చగాడు (Beggar) మూవీలో తల్లి బాగుండాలనే తపనతో కోటీశ్వరుడైనా తనయుడు భిక్షాటన చేస్తాడు. కానీ రియల్ లైఫ్‌లో అలాంటి ఘటనలు అసాధ్యమే. కానీ ఓ భర్త తన భార్య ఆరోగ్యం కోసం భిక్షాటన చేసి రియల్ బిచ్చగాడుగా అందరి మనసులను గెలుచుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన కాసర్ల జలంధర్ రెడ్డికి, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్‌కు చెందిన శిరీషతో 2006లో పెళ్లి జరిగింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి. వారికి పిల్లలు లేరు. కరీంనగర్‌లో అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేస్తూ జలందర్ రెడ్డి, ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ శిరీష దంపతులు అద్దె ఇంట్లో జీవనం సాగించారు.

శిరీష అనారోగ్యం బారిన పడగా సంపాదన అంతా వైద్యానికి ఖర్చు చేశారు. అయినా ఆమెకు నయం కాలేదు. దీంతో వేములవాడ (Vemulawada) రాజన్న సన్నిధిలో భిక్షాటన చేస్తే ఆమె కోలుకుంటుందనే నమ్మకంతో దంపతులు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. చిన్న చిన్న మనస్పర్థలతో భార్యాభర్తలు విడిపోతున్న ఈ రోజుల్లో ఆ దంపతులు ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ భిక్షాటన చేస్తూ దేవుడి సన్నిధిలో కలిసి ఉంటున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>