Mobile Popup Ad
Mobile Popup Ad

ఉప్పల్‌లో తాగునీటికి కటకట.. రోడ్డెక్కిన మహిళలు

కలం వెబ్‌డెస్క్: వేసవిలో తాగునీటి ఎద్దడి (Water Crisis) ప్రజలకు పెద్ద సమస్యగా మారుతోంది. తాగునీటి ఎద్దడిని నివారించడానికి అధికారులు ప్రత్యేక కార్యాచరణ, ప్రణాళికలు రూపొందించినప్పటికీ ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదు. ఈ క్రమంలో మేడ్చల్ జిల్లా ఉప్పల్ (Uppal) జోన్ పరిధిలోని చిలుకానగర్ బస్తీలో నీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. గత 15 రోజులుగా మంచినీటి సరఫరా నిలిచిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళలు స్థానిక బస్తీ దవాఖాన వద్ద ఖాళీ బిందెలతో ధర్నాకు దిగారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజు విడిచి రోజు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. సమస్య పరిష్కారం కాకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని బస్తీ వాసులు హెచ్చరించారు.

Read Also: హైదరాబాద్‌లో లవ్ జిహాద్.. నవాజ్ మోసాలు బయటపెట్టిన బాధితురాలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>