కలం, హనుమకొండ: హనుమకొండలో గంజాయి (Ganja Seized) కలకలం రేపింది. హనుమకొండ పోలీస్ స్టేషన్ (Hanamkonda Police) పరిధిలోని రెడ్డి కాలనీ ప్రధాన రహదారిపై రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.10 వేల విలువగల సుమారు 200 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి ఎక్కడినుంచి తీసుకొచ్చాడు? ఇతనికి సహకరించింది ఎవరు? ఇతనితోపాటు ఇంకా ఎంతమంది గంజాయి విక్రయం చేస్తున్నారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Read Also: విద్యా శాఖను అందుకే నా దగ్గర పెట్టుకున్నా: సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: X(Twitter)

