Mobile Popup Ad
Mobile Popup Ad

అక్రమాస్తుల కేసు.. జైలుకు జలమండలి జీఎం

కలం, క్రైమ్ బ్యూరో: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జలమండలి జీఏం (Water Board GM) అనంతకుమార్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను ఏసీబీ అధికారులు చంచల్‎గూడ జైలుకు తరలించారు.ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో మంగళవారం ఏసీబీ అధికారులు అనంతకుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అనంతకుమార్ నివాసంతో పాటు ఆయన బంధువులు,మిత్రుల ఇళ్లల్లో ఏకకాలంలో 8 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు చేపట్టారు. ఈ క్రమంలో అనంతకుమార్‎కు సంబంధించి భారీగా ఆస్తులు గుర్తించారు. సోదాల్లో భాగంగా అనంతకుమార్ నివాసంలో రూ .1.10 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అనంతకుమార్‎కు నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో 18 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.అంతేకాకుండా హైదరాబాద్‎లో 6 ఓపెన్ ప్లాట్లు, 3 ప్లాట్లు, ఒక ఇల్లు ఉన్నట్లు గుర్తించారు. ఇంట్లో నగదుతో పాటు 2.1 కిలోల బంగారం ఆభరణాలు, 9.2 కిలోల వెండి వస్తువులు,ఒక కారు,బైకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఆస్తుల విలువ రూ.5.88 కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు. అనంతరం అనంతకుమార్ పై అక్రమాస్తుల కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>