మాస్టర్ ప్లాన్‌కు మతం రంగు పూయడం సరికాదు :బైంసా మున్సిపల్ చైర్మన్

కలం, బైంసా: బైంసా పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం రూపొందిస్తున్న మాస్టర్ ప్లాన్‌ (Bhainsa Master Plan)కు మతం రంగు పూయడం సరికాదని మున్సిపల్ చైర్మన్ దత్తాద్రి, వైస్ చైర్‌పర్సన్ కుతీజా సిద్ధిఖీ అన్నారు. గురువారం పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 2040 నాటికి పట్టణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రూపొందించినట్లు తెలిపారు. ఈ ప్రణాళికను అడ్డుకునేందుకు ఎంఐఎం పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పట్ల ఎంఐఎం కౌన్సిలర్ జాబిర్ అహ్మద్ దురుసుగా వ్యవహరిస్తూ నిరసన నినాదాలు చేయడం సరికాదన్నారు. గతంలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎంపిక సమయంలో ఒక స్థానాన్ని దక్కించుకున్న ఎంఐఎం నాయకులు, ఇప్పుడు కలెక్టర్‌పై మతపరమైన ఆరోపణలు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. బైంసాలో గత కొంతకాలంగా గణేశ్, దుర్గామాత నవరాత్రులతో పాటు రంజాన్, బక్రీద్ పండుగలను హిందూ, ముస్లింలు పరస్పర సహకారంతో ప్రశాంతంగా జరుపుకుంటున్నారని తెలిపారు.

ఈ సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసేలా మతపరమైన రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు. మున్సిపల్ కమిషనర్ నియామకం, చెక్కులపై సంతకాల విషయంలోనూ సమస్యలు ఉన్నాయన్నారు. బ్యాంకుల్లో చెక్కులు పాస్ కాకుండా లేఖలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పుడు దరఖాస్తులు చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్‌కు జరిగిన ఘటనపై మున్సిపల్ కౌన్సిల్ తరఫున క్షమాపణలు చెబుతున్నట్లు చైర్మన్, వైస్ చైర్‌పర్సన్ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>