కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) ఉమ్మడి జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తుంది. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో విస్తారంగా వర్షాలు (Rains) కురుస్తున్నాయి. నిజామాబాద్ నగరంలో వర్షంతో జనజీవనం స్తంభించింది. పలు ప్రైవేట్ పాఠశాలలు ముందు జాగ్రత్తగా ప్రైమరీ నుంచి ఐదవ తరగతి వరకు పిల్లలకు సెలవు ప్రకటించారు.
మరోవైపు వర్షం వల్ల దుకాణాలు సైతం తెరుచుకోలేదు. చిరు వ్యాపారులు కూడా రోడ్లపై కనిపించడం లేదు. వాహనాల సందడి లేక ప్రధాన రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. భారీ వర్షంతో నిజామాబాద్ నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చంద్రశేఖర్ కాలనీ నాగారం ముబారక్ నగర్ మాలపల్లి అర్సపల్లి గౌతమ్ నగర్ లాంటి ప్రాంతాల్లో డ్రైనేజీలు వరదనీరుతో ఉప్పొంగాయి.
Read Also: గోదావరి ఉగ్రరూపం.. మేడిగడ్డ బ్యారేజీకి పెరుగుతున్న వరద
Follow Us On : WhatsApp

