Mobile Popup Ad
Mobile Popup Ad

వరంగల్‌లో రౌడీషీటర్లతో పోలీసుల వినూత్న కవాతు

కలం, వరంగల్ :  వరంగల్‌లో(Warangal) పోలీసులు వినూత్న చర్య చేపట్టారు. రౌడీషీటర్లను (Rowdy Sheeters) రోడ్డుపై కవాతు చేయిస్తూ కఠిన సందేశం ఇచ్చారు. వరంగల్ సబ్ డివిజన్‌లోని అజాంజాహీ మిల్స్ కాలనీ ఠాణా నుంచి ఖిలా వరంగల్ తహసీల్దార్ కార్యాలయం వరకు రౌడీషీటర్లను నడిపిస్తూ పోలీసులు తీసుకెళ్లారు. మండుటెండలో సీఐ రమేష్, ఎస్సైలు వారిని పర్యవేక్షించారు. ఖిలా వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్ ఎదుట రౌడీషీటర్లను బైండోవర్ చేశారు. ముందు పోలీసులు, వెనుక జీపులు, మధ్యలో రౌడీషీటర్లు నడిచేలా ఈ కవాతు నిర్వహించారు. నేరస్థులకు కఠిన హెచ్చరికగా ఈ చర్యను పోలీసులు చేపట్టారని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ ఘటనతో నేర కార్యకలాపాలకు పాల్పడేవారికి స్పష్టమైన సందేశం వెళ్లినట్లు అధికారులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>