Mobile Popup Ad
Mobile Popup Ad

16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా నిషేధించాలి : ఎంపీ కడియం కావ్య

కలం, వరంగల్ బ్యూరో : దేశవ్యాప్తంగా 16 ఏళ్ల లోపు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా వేదికలపై నిషేధం (Social Media Ban) విధించాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సోషల్ మీడియా ప్రభావంపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో లోక్ సభలో గురువారం కావ్య ఈ అంశాన్ని ప్రస్తావించారు. సోషల్ మీడియా వేదికల దుర్వినియోగం దేశవ్యాప్తంగా పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. తప్పుడు సమాచార వ్యాప్తి, ఆన్‌లైన్‌లో పెరుగుతున్న విషపూరిత వ్యాఖ్యలు, సమాజంలో విభేదాలను పెంచే పరిస్థితులు వంటి అంశాలను ఆమె ప్రస్తావించారు. నియంత్రణలు లేకుండా కొనసాగుతున్న డిజిటల్ వేదికలు ప్రజాభిప్రాయాన్ని తప్పుదోవ పట్టించే పరిస్థితులు నెలకొంటున్నాయని ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. సమాజ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అవసరమైతే 16 ఏళ్ల లోపు వయస్సు గల వారికి సోషల్ మీడియా వినియోగంపై సంపూర్ణ నిషేధం (Social Media Ban) విధించాలని ఎంపీ కావ్య కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>