ప్రతిభా పరీక్షలో వనపర్తి హరిజనవాడ విద్యార్థుల సత్తా.. ఘనంగా సత్కారం

కలం, వనపర్తి: వనపర్తి (Wanaparthy) పట్టణంలోని ZPHS హరిజనవాడ పాఠశాల (ZPHS Harijanawada) లో పాలమూరు ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులకు (Students) ప్రతిభా పరీక్ష నిర్వహించారు. 6వ తరగతిలో హనోక్ ప్రథమ, వర్షిని ద్వితీయ, క్రిష్ తృతీయ స్థానాలు సాధించారు. 7వ తరగతిలో సుహాని, లక్ష్మీదీపక్, శ్రీ విఘ్నేష్ వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.

8వ తరగతిలో అబ్దుల్ రెహమాన్, మైధిలి, కిరణ్.. 9వ తరగతిలో ఆలియా తబస్సు, ప్రణవ్, వి. శివకుమార్.. 10వ తరగతిలో జయలక్ష్మి, మనోజ్, సింధు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచి మండల స్థాయి ప్రతిభా పోటీలకు ఎంపికైన విద్యార్థులు మెడల్స్, మెమెంటోలు అందుకున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వనపర్తి జిల్లా ఏజీఎం గణేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్, సీనియర్ ఉపాధ్యాయుడు వాకిట రవికుమార్, ఉపాధ్యాయ బృందం విద్యార్థులను గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్, మెమెంటోలతో సత్కరించారు. మండల స్థాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>