కలం, అశ్వారావు పేట : పట్టణంలో (Aswaraopeta) ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వరద నీరు చేరి ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కాసాని పద్మ, అశ్వారావు పేట 14వ వార్డు కౌన్సిలర్ డా. ఉదయజ్యోతి మానవతా దృక్పథంతో స్పందించారు.వర్షాల కారణంగా ప్రయాణాలు సాగించలేక ఇబ్బందులు పడుతున్న దూర ప్రాంత ప్రయాణికులకు ఆహార పొట్లాలు, బిస్కెట్లు, తాగునీటి బాటిళ్లను పంపిణీ చేశారు. భారీ వర్షాల సమయంలో ఆకలితో ఇబ్బందులు పడకుండా ప్రయాణికులకు తమ వంతు సహాయం అందించారు.
అదేవిధంగా ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజల రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న పోలీస్ శాఖ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలకు ధైర్యం చెబుతూ, సహాయక చర్యలు చేపడుతూ, ప్రజల భద్రత కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరి సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. జలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.

