చెట్టెక్కి ఫోన్ చేసి ప్రాణాలు కాపాడుకున్న మహిళ

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట (Dammapeta) మండలంలోని దురదపాడు గ్రామంలో బుధవారం భారీ వరద ఉద్ధృతిలో చిక్కుకున్న ఓ మహిళను ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు అత్యంత సాహసోపేతంగా రక్షించాయి. దురదపాడు గ్రామానికి చెందిన నాగమణి ఉదయం పొలం పనులకు వెళ్లిన సమయంలో కురిసిన భారీ వర్షాలకు స్థానిక మల్లెపూల వాగు ఒక్కసారిగా ఉద్ధృతంగా పొంగి ప్రవహించింది. దీంతో ఆమె తిరుగు ప్రయాణంలో వరద నీటిలో చిక్కుకుని బయటకు రాలేకపోయారు.

​పరిస్థితి ప్రమాదకరంగా మారుతుండటంతో ఆమె భయపడకుండా సమయస్ఫూర్తిని ప్రదర్శించి, వెంటనే సమీపంలోని చెట్టెక్కి తన వద్ద ఉన్న ఫోన్ ద్వారా గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) వెంటనే స్పందించి, అధికారులను అప్రమత్తం చేశారు.

​మంత్రి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఎస్‌డీఆర్‌ఎఫ్‌ రెస్క్యూ బృందం తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని, తీవ్ర ఉద్ధృతి మధ్య కూడా ఎంతో సాహసంతో వ్యవహరించి ఆ మహిళను సురక్షితంగా రక్షించి ఒడ్డుకు చేర్చింది. సకాలంలో స్పందించి నాగమణి ప్రాణాలు కాపాడిన మంత్రి తుమ్మలకు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి, సహకరించిన గ్రామస్తులకు బాధిత మహిళ కుటుంబ సభ్యులు, స్థానికులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Also Read : ఎన్నికల కమిషనర్ల పదవీ భద్రతపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>