కలం, వెబ్ డెస్క్: ముంబైలో భారీ అగ్ని ప్రమాదం (Mumbai Fire Accident) చోటుచేసుకుంది. ప్రతీక్షా నగర్‌లోని పోలీస్ క్వార్టర్స్‌లోని ఎల్ 5 భవనంలో మూడు సిలిండర్లు పేలాయి. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. పేలుడు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సమాచారం ప్రకారం, మంగళవారం రాత్రి వడాలాలోని మాలా గార్డెన్ సమీపంలో ఉన్న ప్రతీక్షా నగర్‌లోని సుమారు రెండు నుంచి నాలుగు భవనాల్లో అగ్ని ప్రమాదం జరిగింది.

