తెలంగాణలో చలి పంజా.. ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

కలం, వెబ్​ డెస్క్​: తెలంగాణ రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు (Telangana Weather) పడిపోతుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో చలి ప్రభావం అధికంగా కనిపిస్తోంది. సాయంత్రం 6 గంటల నుంచి చలి పెరుగుతోంది. గత రెండు రోజుల్లోనే హైదరాబాద్​ సహా 21 జిల్లాల్లో ఒక్కసారిగా 15 డిగ్రీల కంటే తక్కువగా టెంపరేచర్​ పడిపోయింది. మంగళవారం నిర్మల్​ జిల్లాలోని కుబీర్​ లో అత్యల్పంగా 14.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

అలాగే, ఆదిలాబాద్​, మంచిర్యాల, సూర్యాపేట, నిజామాబాద్​, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట, జయశంకర్​ భూపాలపల్లి, మహబూబాబాద్​, వికారాబాద్​ జిల్లాల్లో 14.7 డిగ్రీల చొప్పున టెంపరేచర్​ రికార్డ్​ అయింది. దీంతో గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో చలిగాలుల తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పగటిపూట కూడా ఎండ ఉన్పప్పటికీ చల్లటి గాలులు వీస్తున్నాయి. కాగా, రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగనుందని.. 11–12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>