కలం, వెబ్ డెస్క్ : కెనడాలోని అంటారియోలో 2026 మే నెలలో తొలిసారి వెలుగుచూసిన కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1 (COVID PJ.2.1) ప్రస్తుతం అమెరికా, యూరప్, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా పలు దేశాలకు వేగంగా వ్యాపిస్తోంది. SARS-CoV-2 వైరస్‌కు చెందిన ఈ కొత్త లినేజ్ మానవ శరీరంలోని ACE2 రిసెప్టర్లకు మరింత సమర్థవంతంగా అతుక్కునే అవకాశం ఉన్నట్లు ‘జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్’ ప్రచురించిన పరిశోధనలో వెల్లడైంది.
అయితే ఇది కొత్తగా వచ్చిన COVID-2 లేదా మరో కొత్త మహమ్మారి కాదని, ఇప్పటికే ఉన్న కోవిడ్ వైరస్‌లో రూపాంతరం చెందిన వేరియంట్ మాత్రమేనని స్పష్టం చేసిన శాస్త్రవేత్తలు, దీని వ్యాప్తి తీరుపై నిశితంగా నిఘా ఉంచారు.

