గులాబీ మయమైన నెక్లెస్ రోడ్: క్యాన్సర్‌పై పోరులో ‘ పింక్ పవర్’ రన్!

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ వేదికగా గల హెచ్‌ఎమ్‌డీఏ గ్రౌండ్స్ నుంచి ‘పింక్ పవర్ రన్ 3.0’ (Pink Power Run) మూడో ఎడిషన్ కోలాహలంగా ప్రారంభమైంది. రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పించడం, ముందస్తు ఆరోగ్య రక్షణను ప్రోత్సహించడమే లక్ష్యంగా సుధా రెడ్డి ఫౌండేషన్, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) ఫౌండేషన్ సంయుక్తంగా ఈ భారీ అవగాహన పరుగును నిర్వహించాయి.

ఈ రన్‌లో గులాబీ రంగు దుస్తులు ధరించిన వేలాది మంది పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమాని(Pink Power Run )కి ప్రముఖ సినీ నటుడు సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఇటువంటి మంచి ఆశయం కోసం ప్రతి సంవత్సరం సుధా రెడ్డి, కృష్ణా రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఈ రన్ నిర్వహించడం అభినందనీయమని, ఈ కార్యక్రమంలో భాగం కావడం చాలా ఆనందంగా ఉందని సిద్ధు తెలిపారు.

Also Read : అటా.. ఇటా.. సీఈసీ వివాదంపై బీఆర్ఎస్ ఎటు..?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>