ఎదురెదురుగా ఢీకొన్న లారీ, టిప్పర్.. ఆర్తనాదాలు చేస్తూ డ్రైవర్ మృతి!

కలం, వెబ్ డెస్క్ : విజయనగరం (Vizianagaram Accident) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దత్తిరాజేరు మండలం కోమటపల్లి గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న లారీ, టిప్పర్ తీవ్ర వేగంతో బలంగా ఢీకొన్నాయి. ఈ భీకర ప్రమాదంలో టిప్పర్ కేబిన్‌లో డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ చిక్కుకుపోయారు. బయటకు రాలేక, కేబిన్ భాగాల మధ్య నలిగిపోతూ వారు తీవ్ర వేదనతో చేసిన అరుపులు, కేకలు అక్కడ ఉన్న వారిని కలచివేశాయి.

తమను కాపాడాలంటూ వారు తీవ్రంగా విలపించడంతో ఘటనా స్థలంలో భయాందోళనలు నెలకొన్నాయి. స్థానికులు వెంటనే పోలీసులకు, రెస్క్యూ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ప్రత్యేక పరికరాల సహాయంతో కేబిన్‌లో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. అయితే, తీవ్ర గాయాలపాలైన టిప్పర్ డ్రైవర్ చికిత్స అందించే లోపే కేబిన్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు బీహార్ రాష్ట్రానికి చెందిన రవీంద్రగా పోలీసులు గుర్తించారు. క్లీనర్‌ను సురక్షితంగా బయటకు తీసి, చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>