కలం, వెబ్ డెస్క్ : వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu)తో పాటు పలువురు వైసీపీ నాయకులపై మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అనుమతులు లేకుండా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో ఈ చర్యలు తీసుకున్నారు.
మెగా డీఎస్సీ (Mega DSC) అవకతవకలపై వైసీపీ చేపట్టిన ‘ఛలో విజయవాడ(Chalo Vijayawada)’ కార్యక్రమానికి ఎలాంటి పోలీసు అనుమతి లేకపోవడంతో అధికారులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో విజయవాడ వైపు వెళ్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు కాన్వాయ్‌ను కాజా టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ అంబటి రాంబాబుతో పాటు వైసీపీ నేతలు, కార్యకర్తలు టోల్ ప్లాజా వద్దే రోడ్డుపై బైఠాయించి తీవ్ర ఆందోళన చేపట్టారు.
పోలీసులతో వాగ్వాదం.. కేసు నమోదు రహదారిపై ధర్నా కారణంగా కాసేపు తీవ్ర వాహన రాకపోకలకు అంతరాయం కలగడంతో అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఆందోళన విరమించి సహకరించాలని కోరినప్పటికీ వినకపోవడంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనుమతి లేకుండా నిరసనలకు దిగడం, ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించినందుకు గాను అంబటి రాంబాబు(Ambati Rambabu)తో పాటు మరో 15 మంది వైసీపీ నేతలపై మంగళగిరి పీఎస్‌లో కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read : నేడు కాకినాడలో జనసేన కీలక భేటీ: కేడర్‌కు పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం
Follow Us On: Instagram

