కవిత కొత్త పార్టీపై మంత్రి వివేక్ రియాక్షన్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంత్రి వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy) ఆమెపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కల్వకుంట్ల కుటుంబంలో నెలకొన్న ఆస్తి గొడవల కారణంగానే కవిత ఈ కొత్త రాజకీయ పంథాను ఎంచుకున్నారని ఆరోపించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన భారీ అవినీతిని కవితే (Kavtiha) స్వయంగా తన వ్యాఖ్యల ద్వారా బయటపెట్టారని పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కవిత పార్టీ ప్రకటన వెలువడిన మరుసటి రోజే మంత్రి వివేక్ ఘాటు వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>