లేట్‌ ఉద్యోగులకు కలెక్టర్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

కలం, భువనగిరి: ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల సమయపాలనపై యాదాద్రి భువనగిరి (Bhuvanagiri) జిల్లా ఇన్‌చార్జ్  కలెక్టర్ భాస్కరరావు(Bhaskar Rao) కఠిన వైఖరి అవలంబించారు. విధులకు ఆలస్యంగా వచ్చే సిబ్బందిని ఇకపై ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తూ శుక్రవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఉదయం 10.40 గంటలు దాటిన తర్వాత కలెక్టరేట్‌కు చేరుకున్న పలువురు ఉద్యోగులను ప్రధాన ద్వారం వద్దే ఆపివేశారు. ఉద్యోగుల హాజరు, సమయపాలనను పారదర్శకంగా పర్యవేక్షించేందుకు కలెక్టరేట్‌లో ఇప్పటికే సాంకేతిక ఆధారిత హాజరు విధానాన్ని అమలు చేస్తున్నారు.

‘మీ ప్రమాణం’ మొబైల్ యాప్ ద్వారా ఉద్యోగుల ఖచ్చితమైన లొకేషన్‌ను గుర్తించే విధానాన్ని అమలు చేస్తున్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలోకి వచ్చిన అనంతరం ఫేషియల్ రికగ్నిషన్ ఆధారిత డిజిటల్ హాజరు నమోదు విధానం కూడా అందుబాటులో ఉంది. సాంకేతిక ఆధారిత హాజరు విధానం అమల్లో ఉన్నప్పటికీ కొంతమంది ఉద్యోగులు విధులకు ఆలస్యంగా వస్తుండటంతో ఇన్‌చార్జి కలెక్టర్ స్వయంగా తనిఖీలు చేపట్టారు. ప్రజలకు నేరుగా సేవలు అందించే కలెక్టరేట్‌లో ఉద్యోగులందరూ నిర్ణీత సమయానికి విధులకు హాజరుకావాలని భాస్కరరావు సూచించారు. ఇకపై విధులకు ఆలస్యంగా వచ్చే ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. సమయపాలన విషయంలో అన్ని శాఖల సిబ్బంది నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>