కలం, రాజన్న సిరిసిల్ల: యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవ వేడుకలను (Vishwakarma Yajna Mahotsav) జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్, బీసీ కుల సంఘాల నాయకులు, జిల్లా అధికారులు సిబ్బందితో కలిసి విరాట్ విశ్వకర్మ చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి, పూలమాలలు వేసి నమస్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో అధికారికంగా విశ్వకర్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని అన్నారు. విరాట్ విశ్వకర్మ దైవ రూపంగా, ఆధ్యాత్మికతో, భక్తిశ్రద్ధలతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సౌజన్య, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, విశ్వకర్మ కుల సంఘ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

