కలం, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచకప్ (T20 World Cup) టైటిల్‌ను భారత్ వరుసగా రెండోసారి కైవసం చేసుకున్న వేళ.. మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) తన సోషల్ మీడియాలో కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir)పై ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. గంభీర్ ముఖంలో చిరునవ్వు చాలా బాగుందని, సీరియస్‌నెస్‌తో కూడిన ఆ నవ్వు ఒక ‘కిల్లర్ కాంబినేషన్’ అని కొనియాడారు. అహ్మదాబాద్‌లో చరిత్ర సృష్టించిన టీమ్ ఇండియాకు, సపోర్ట్ స్టాఫ్‌కు, అభిమానులకు ఆయన అభినందనలు తెలిపారు. మన ఆటగాళ్లు ఆడుతుంటే చూడటం ఎంతో ముచ్చటగా ఉందని ధోనీ పేర్కొన్నారు. ప్రస్తుతం ధోనీ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. విశ్వవిజేతగా నిలిచిన భారత్ సంబరాల్లో మునిగిపోగా, లెజెండరీ కెప్టెన్ నుంచి వచ్చిన ఈ ప్రశంసలు అభిమానుల్లో మరింత జోష్ నింపాయి.

