భువనేశ్వర్‌లో షాకింగ్ ఘటన.. పబ్లిక్‌లో యువతిపై దాడి, వీడియో చూస్తే!

కలం, వెబ్ డెస్క్: మహిళల రక్షణ కోసం కఠిన చట్టాలు అమలు చేస్తున్నా, శిక్షలు విధిస్తున్నా చాలామందిలో మార్పు రావడం లేదు. చిన్న చిన్న విషయాలకే మహిళలను హింసిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో భువనేశ్వర్‌లో (Bhubaneswar) జరిగిన ఓ ఘటన ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక వ్యక్తి తన బైక్‌పై వెనుక కూర్చున్న యువతిని నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే పదే పదే కొట్టాడు. భువనేశ్వర్‌లోని స్టూడియో స్క్వేర్ వద్ద ఈ ఘటన జరగ్గా, అటుగా వెళ్తున్నవారు దీనిని చిత్రీకరించారు. పట్టపగలే బహిరంగ ప్రదేశంలో ఒక మహిళపై ఇలాంటి హింసకు పాల్పడటం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.

ఈ ఘటన వేధింపులతో కూడిన సంబంధాలకు నిదర్శనమని నెటిజన్లు మండిపడుతున్నారు. ఏ పరిస్థితుల్లోనైనా మహిళలపై ఇలాంటి దాడులు జరగడం అమానుషమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రత, ఇలాంటి హింసాత్మక ప్రవర్తనపై సమాజంలో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందంటున్నారు. మహిళను వేధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ (Viral)గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>