Mobile Popup Ad
Mobile Popup Ad

రాజస్థాన్‌లో దారుణం.. పిల్లాడికి బీరు తాగించి సిగరెట్ ఇచ్చి, షాకింగ్ వీడియో

కలం, వెబ్ డెస్క్: రాజస్థాన్‌ (Rajasthan)లో ఓ వ్యక్తి చిన్న పిల్లాడికి బీరు తాగించి, సిగరెట్ ఇస్తున్న షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఆ వ్యక్తి ఒక చేతితో బీరు చిన్నారికి తాగిస్తుండగా, మరో చేతితో సిగరెట్‌ను పీల్చేలా ప్రోత్సహించాడు. ఈ ఘటనపై నెటిజన్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లాడి ఆరోగ్యం, భద్రతపై కనీస బాధ్యత లేకుండా ప్రవర్తించిన ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

ఈ వీడియోలో కనిపిస్తున్న మోటార్ సైకిల్ నంబర్ ప్లేట్ (RJ 25 SS 8392) ఆధారంగా ఇది రాజస్థాన్‌కు (Rajasthan) చెందినదిగా గుర్తించారు. నెటిజన్లు, సోషల్ వర్కర్స్ రాజస్థాన్ పోలీసులను ట్యాగ్ చేస్తూ, ఆ వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చిన్న పిల్లలను సోషల్ మీడియా కంటెంట్ కోసం, వినోదం కోసం ఇలాంటి ప్రమాదకరమైన అలవాట్లకు గురిచేయడం చట్టరీత్యా నేరమన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి నిందితుడికి శిక్ష పడేలా చూడాలని నెటిజన్లు గట్టిగా కోరుతున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Read Also: ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆ వాహనాలు రోడ్డెక్కితే అంతే!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>