చైనాలో మరో అద్భుతం.. కుక్కలను షికారుకు తీసుకెళ్తున్న ‘రోబో డాగ్స్’

కలం, వెబ్ డెస్క్: చైనా (China) సాంకేతికతను అందిపుచ్చుకుంటూ సరికొత్త ప్రయోగాలు చేస్తోంది. ఇప్పటికే డ్రైవర్ లేని స్కూటీలు.. గాల్లో ప్రయాణించే డ్రోన్ ట్యాక్సీలు, స్మార్ట్ హైవేలు లాంటివి ఎన్నో పరిచయం చేస్తూ దూసుకుపోతోంది. తాజాగా రోబో డాగ్స్‌ను (Dog Robots) తయారుచేసి ఆశ్చర్యపర్చింది. పెంపుడు కుక్కలను బయటకు తీసుకెళ్లడం యజమానులకు ఒక పెద్ద బాధ్యతగా ఉండేది, కానీ ఇప్పుడు ఆ పనిని డాగ్ డాగ్స్ చేసేస్తున్నాయి. ఇటీవల ఒక రోబో తన వీపుపై పెంపుడు కుక్కను కూర్చోబెట్టుకుని వీధుల్లో షికారు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అత్యాధునిక సెన్సార్ల సాయంతో పనిచేసే ఈ రోబోలు (Dog Robots) అడ్డంకులను గుర్తిస్తూ పెంపుడు జంతువులను క్షేమంగా తిరిగి ఇంటికి చేరుస్తున్నాయి. ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. భవిష్యత్తులో మనుషుల పనులన్నీ రోబోలే చేసేలా ఉన్నాయని సరదాగా కామెంట్ చేస్తున్నారు. నగరాల్లో బిజీగా ఉండే యజమానులకు ఈ టెక్నాలజీ ఒక వరంగా మారుతోందని అంటున్నారు.

Read Also: నో కాంప్రమైజ్.. ఇదే జెన్ జీ ఫార్ములా!!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>