కలం, వెబ్ డెస్క్ : అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని రొనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్టు (Ronald Reagan Airport)లో పెను ప్రమాదం తృటిలో తప్పింది. టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండు విమానాల రెక్కలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. డల్లాస్ వెళ్లాల్సిన AA638 విమానం, చికాగో వెళ్లాల్సిన AA2152 విమానం ఈ ప్రమాదానికి గురయ్యాయి. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో రెండు విమానాల్లో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది అంతా సురక్షితంగా బయటపడ్డారు.
ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ అధికారులు రెండు విమానాలను తిరిగి టెర్మినల్ గేట్ల వద్దకు తరలించారు. ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టనుంది.

