వినేశ్ ఫొగాట్‌కు బిగ్ షాక్.. దేశవాళీ పోటీలపై నిషేధం

కలం, వెబ్ డెస్క్ : భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌ (Vinesh Phogat) కు భారీ షాక్ తగిలింది. పారిస్ ఒలింపిక్స్ 2024 తర్వాత రిటైర్మెంట్ ప్రకటించి, నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని తిరిగి మ్యాట్‌పైకి అడుగుపెట్టాలనుకున్న ఆమె ఆశలకు బ్రేక్ పడింది. యాంటీ-డోపింగ్ నిబంధనల ఉల్లంఘన, క్రమశిక్షణా రాహిత్యం వంటి అంశాలపై భారత రెజ్లింగ్‌ సమాఖ్య (WFI) ఆమెకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు జూన్ 26 వరకు దేశీయ పోటీల్లో పాల్గొనేందుకు అనర్హురాలిగా ప్రకటించింది. దీంతో ఉత్తరప్రదేశ్ లోని గోండాలో మే 10 నుంచి 12 వరకు జరగనున్న నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌లో ఆమె పాల్గొనవద్దని నిషేధం విధించింది.

యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW) యాంటీ-డోపింగ్ నిబంధనల ప్రకారం.. రిటైర్మెంట్ తర్వాత మళ్లీ పోటీల్లోకి దిగాలంటే అథ్లెట్లు కనీసం ఆరు నెలల ముందుగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ వినేశ్ ఈ నిబంధనను పాటించలేదని WFI ఆరోపించింది. అంతేకాదు 2024 పారిస్ ఒలింపిక్స్‌లో బరువు నిబంధనల కారణంగా అనర్హతకు గురై దేశ ప్రతిష్టను దెబ్బతీశారని నోటీసుల్లో పేర్కొంది. పారిస్ ఒలింపిక్స్ లో ఐఓఏ తాత్కాలిక కమిటీ నిర్వహించిన ఎంపిక ట్రయల్స్‌లో నిబంధనలకు విరుద్ధంగా రెండు వేర్వేరు బరువు విభాగాల్లో పాల్గొనడాన్ని తప్పుబట్టింది. ఈ ఆరోపణలపై 14 రోజులోగా వివరణ ఇవ్వాలని వినేశ్ కు WFI గడువు విధించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>