Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణ నూతన పీసీసీఎఫ్‌గా వినయ్ కుమార్ నియామకం

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అటవీ శాఖకు కొత్త అధిపతి రాబోతున్నారు. ప్రిన్సిపల్ చీఫ్​ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్‌గా వినయ్ కుమార్‌ను (Vinay Kumar) నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత పీసీసీఎఫ్ డాక్టర్ సి.సువర్ణ ఈ నెల 30వ తేదీతో రిటైర్మెంట్ కాబోతున్న నేపథ్యంలో వినయ్ కుమార్ ఆ బాధ్యతలు చేపట్టబోతున్నారు.

1992 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారైన ఈయన (Vinay Kumar) ప్రస్తుతం వన్యప్రాణి విభాగానికి పీసీసీఎఫ్‌గా, చీఫ్ వైల్డ్ లైన్ వార్డెన్‌గా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో జులై ఒకటో తేదీన కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు (Sanjay Jaju), కొత్త పీసీసీఎఫ్‌గా వినయ్ కుమార్ ఒకేసారి బాధ్యతలు చేపట్టబోతుండం గమనార్హం.

Read Also: తెలంగాణకు నితిన్​ నబీన్​.. మూడు రోజుల పర్యటన!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>